ఆంధ్రకు కఠిన పరీక్ష – నేటినుంచి రంజీట్రోఫీ టోర్నమెంట్‌

Jan 5,2024 10:20 #Sports

విశాఖపట్నం : రంజీట్రోఫీ సీజన్‌-2024కు రంగం సిద్ధమైంది. విశాఖపట్నంలోని డా.వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఇంటర్నేషనల్‌ స్టేడియంలో జరిగే తొలి గ్రూప్‌ లీగ్‌ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌ జట్టు పటిష్ట బెంగాల్‌తో తలపడనుంది. ఆంధ్ర జట్టుకు కెప్టెన్‌గా టీమిండియా టెస్ట్‌ ఆటగాడు హనుమ విహారి వ్యవహరించనున్నాడు. అశ్విన్‌ హెబ్బర్‌, జ్ఞానేశ్వర్‌, రికీ బురులతో ఆంధ్ర పట్టు పటిష్టంగా ఉన్న బెంగాల్‌ను ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఆంధ్ర జట్టు ఎలైట్‌ గ్రూప్‌ దాటి నాకౌట్‌కు చేరాలంటే ప్రతి మ్యాచ్‌లో గెలుపు తప్పనిసరి. ఇదే గ్రూప్‌లో ముంబయి, బీహార్‌, అస్సాం, ఛత్తీస్‌గడ్‌, ఉత్తరప్రదేశ్‌, కేరళ జట్లు ఉన్నాయి.

➡️