విరాట్‌ కోహ్లీ దూకుడు..

Mar 29,2024 22:25 #Sports

కోల్‌కతా ముందు భారీ లక్ష్యం
ఐపిఎల్‌ 2024 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ దూకుడుగా ఆడారు. టాపార్డర్‌, మిడిలార్డర్‌ విఫలమైన వేళ ఒంటరి పోరుతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు భారీ స్కోర్‌ను అందించారు. కోల్‌కతా ముందు 183 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి ఆరంభంలోనే షాక్‌ తగిలింది. రెండో ఓవర్‌లోనే హర్షిత్‌ రాణా బౌలింగ్‌లో డుప్లెసిస్‌ (6 బంతుల్లో 8పరుగులు) ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కామెరూన్‌ గ్రీన్‌ (21బంతుల్లో 33పరుగులు) కాసేపు నిలకడగా ఆడాడు. కానీ 9వ ఓవర్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. ఇక మిడిలార్డర్‌ పూర్తిగా విఫలమయ్యింది. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (19బంతుల్లో 28) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. రజత్‌ పాటిదార్‌ (3), అనుజ్‌ రావత్‌ (3) ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. చివర్లో దినేశ్‌ కార్తిక్‌ (8బంతుల్లో 20పరుగులు) దూకుడుగా మొదలుపెట్టినప్పటికీ.. ఆఖరి బంతికి రనౌట్‌ అయ్యాడు. విరాట్‌ కోహ్లీ (59బంతుల్లో 83పరుగులు) ఒక్కడే మొదట్నుంచి చెలరేగి ఆడాడు. ఫలితంగా ఆరు వికెట్ల నష్టానికి ఆర్సీబీ 182 పరుగులు చేసింది. కోల్‌కతా ముందు 183 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కోల్‌కతా బౌలర్లలో హర్షిత్‌ రాణా, ఆండ్య్రూ రస్సెల్‌ చెరో 2 వికెట్లు తీశారు. సునీల్‌ నరైన్‌కు ఒక వికెట్‌ దక్కాయి.
స్కోర్‌బోర్డు..
రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి (నాటౌట్‌) 83, డుప్లెసిస్‌ (సి)స్టార్క్‌ (బి)హర్షీత్‌ రాణా 8, గ్రీన్‌ (బి)రస్సెల్‌ 33, మ్యాక్స్‌వెల్‌ (సి)రింకు సింగ్‌ (బి)నరైన్‌ 28, రజత్‌ పటీధర్‌ (సి)రింకు సింగ్‌ (బి)రస్సెల్‌ 3, అనుజ్‌ రావత్‌ (సి)సాల్ట్‌ (బి)హర్షీత్‌ రాణా 3, దినేశ్‌ కార్తీక్‌ (రనౌట్‌) సాల్ట్‌ 20, అదనం 4. (20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి) 182పరుగులు.
వికెట్ల పతనం: 1/17, 2/82, 3/124, 4/144, 5/151, 6/182
బౌలింగ్‌: స్టార్క్‌ 4-0-47-0, హర్షీత్‌ రాణా 4-0-39-2, అనుకుల్‌ రారు 2-0-6-0, సునీల్‌ నరైన్‌ 4-0-40-1, ఆండీ రస్సెల్‌ 4-0-29-2, వరణ్‌ చక్రవర్తి 2-0-20-0.

➡️