వాట్‌, బ్రంట్‌ అర్ధసెంచరీలు

Dec 6,2023 22:30 #Sports

భారత్‌-ఇంగ్లండ్‌ మహిళల తొలి టి20 సిరీస్‌

ముంబయి: ఇంగ్లండ్‌ మహిళాజట్టుతో జరుగుతున్న తొలి టి20లో భారత బౌలర్లు తేలిపోయారు. పూజ వస్త్రాకర్‌(0/44), శ్రేయాంక(2/44), ఇషాక్‌(1/38) నిరాశపరచడంతో ఇంగ్లండ్‌ బ్యాటర్స్‌ చెలరేగారు. దీంతో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 197పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. తొలుత సోఫియా(1), అలీసా(0) త్వరగా ఔటైనా.. వాట్‌(75), బ్రంట్‌(77) 2వ వికెట్‌కు ఏకంగా 138పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత జోన్స్‌(23; 9బంతుల్లో 3ఫోర్లు, సిక్సర్‌)తో ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడింది. తొలి రెండు వికెట్లు కోల్పోయాక ఇంగ్లండ్‌ బ్యాటర్లు అద్భుతంగా పుంజుకొని భారీస్కోర్‌కు దోహదపడ్డారు. భారత బౌలర్లు రేణుకకు మూడు, శ్రేయాంక పాటిల్‌కు రెండు, శిఖా ఇషికాకు ఒక వికెట్‌ దక్కాయి. స్కోర్‌బోర్డు.. ఇంగ్లండ్‌ మహిళల ఇన్నింగ్స్‌: సోఫియా డంక్లే (బి)రేణుక సింగ్‌ 1, వాట్‌ (స్టంప్‌)రిచా ఘోష్‌ (బి)షికా ఇషికా 75, అలీసా కాస్పే (బి)రేణుక 0, స్కీవర్‌ బ్రంట్‌ (సి)రీచా ఘోష్‌ (బి)రేణుక సింగ్‌ 77, హీథర్‌ నైట్‌ (బి)శ్రేయాంక 6, అమీ జోన్స్‌ (సి)రోడ్రిగ్స్‌ (బి)శ్రేయాంక 23, కెంప్‌ (నాటౌట్‌) 5, అదనం 10. (20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి) 197పరుగులు. వికెట్ల పతనం: 1/2, 2/2, 3/140, 4/165, 5/1177, 6/197 బౌలింగ్‌: రేణుక ఠాకూర్‌ 4-0-27-3, పూజ వస్త్రాకర్‌ 4-0-44-0, శిఖా ఇషికా 4-0-38-1, దీప్తి శర్మ 3-0-28-0, శ్రేయాంక పాటిల్‌ 4-0-44-2, కనిక అహుజా 1-0-12-0

➡️