Wimbledon: అల్కరాజ్‌ అలవోకగా..

లండన్‌: వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో 3వ సీడ్‌, స్పెయిన్‌ యువ సంచలనం కార్లోస్‌ అల్కరాజ్‌ తొలిరౌండ్‌లో సునాయాసంగా విజయం సాధించాడు. సోమవారం నుంచి ప్రారంభమైన ఈ టోర్నమెంట్‌ తొలిరౌండ్‌లో అల్కరాజ్‌ 7-6(7-3), 7-5, 6-2తో లాజల్‌(ఎస్టోనియా)పై సునాయాసంగా నెగ్గాడు. ఇతర పోటీల్లో 8వ సీడ్‌ రూఢ్‌, 5వ సీడ్‌ మెద్వదెవ్‌, 29వ సీడ్‌ టోఫీ ప్రత్యర్ధులను చిత్తుచేసి రెండోరౌండ్‌కు చేరారు. ఐదుసెట్ల హోరాహోరీ పోరులో టోఫీ 6-7(5-7), 2-6, 6-1, 6-3, 6-3తో అన్‌సీడెడ్‌ అమల్ది(ఇటలీ)పై చెమటోడ్చి నెగ్గాడు. ఇక రూఢ్‌(నార్వే) 7-6(7-2), 6-4, 6-4తో బోల్ట్‌(ఆస్ట్రేలియా)ను, 5వ సీడ్‌ మెద్వదేవ్‌ 6-3, 6-4, 6-2తో కొవాసెవిక్‌(అమెరికా)ను ఓడించారు. మరో పోటీలో 18వ సీడ్‌ బీజ్‌(అర్జెంటీనా) 2-6, 3-6, 4-6తో నకషిమా(అమెరికా) చేతిలో, 19వ సీడ్‌ జారీ(చిలీ) 1-6, 5-7, 4-6తో అన్‌సీడెడ్‌ షపొవొలెవ్‌(కెనడా) చేతిలో వరుససెట్లలో ఓడారు. మరో పోటీలో 22వ సీడ్‌ మన్నారినో(ఫ్రాన్స్‌) 4-6, 6-3, 5-7, 4-6తో సహచర ఆటగాడు మోన్‌ఫీల్‌ ఛేతిలో పరాజయాన్ని చవిచూశాడు.

➡️