సిపిఎం అరకు ఎంపి అభ్యర్థి అప్పలనర్స విస్తృత ప్రచారం

Apr 17,2024 13:12

ప్రజాశక్తి-అరకు
సిపిఎం అరకు పార్లమెంటరీ పార్టీ అభ్యర్థి పాచిపెంట అప్పలనరసయ్య తన ఎన్నికల ప్రచారాన్ని గత కొన్నిరోజులుగా ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. సిపిఎం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు ఆ ప్రచార కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గంటున్నారు. మంగళవారంనాడు ఆయన పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు, బలిజపేటలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. సాలూరులో సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌ నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. గాంధీనగర్‌లో అప్పలనర్సకు మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. బుధవారం జరిగిన ప్రచార కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున పాల్గన్నారు. సుత్తి, కొడవలి, నక్షత్రం గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో అప్పలనర్సను గెలిపించాలని సిపిఎం నాయకులు అభ్యర్థించారు

➡️