డీఎస్సీ అభ్యర్థులకు వయోపరిమితి పెంచాలి : డివైఎఫ్‌

Jun 26,2024 22:40

డీఎస్సీ అభ్యర్థులకు వయోపరిమితి పెంచాలి : డివైఎఫ్‌ఐప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం జులై ఒకటో తేదీన డీఎస్సీ 2024 నోటిఫికేషన్‌ ప్రకటించింది. అందులో పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు వయోపరిమితిని సడలించి 48 సంవత్సరాలకు పొడిగించాలని, ప్రభుత్వం డీఎస్సీ కోచింగ్‌ సెంటర్స్‌ ఏర్పాటు చేయాలని, నకిలీ కోచింగ్‌ సెంటర్స్‌ పైన చర్యలు తీసుకోవాలని డివైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జయచంద్ర డిమాండ్‌ చేశారు. గత ప్రభుత్వం డీఎస్సీ లేకపోవడం వల్ల చాలా మంది నిరుద్యోగులు వయస్సు అయిపోవడం వల్ల చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. దాదాపు కోచింగ్‌ సెంటర్లలో లక్షల రూపాయలు ఖర్చుపెట్టి కోచింగ్‌ తీసుకున్నా, వయో పరిమితి దాటిపోవడంతో ఈ డీఎస్సీలో అప్లై చేసుకోలేకపోతున్నారన్నారు.వయో పరిమితిని 48 ఏళ్లకు పెంచాలని డిమాండ్‌ చేశారు. రేషనలైజేషన్‌ పేరుతో మూసివేసిన పాఠశాలలను తెరవాలని విజ్ఞప్తి చేశారు.

➡️