పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రారంభం

తెలంగాణ : వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్‌ సోమవారం ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్‌ జరగనుంది. మొత్తం 12 జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నిక జరుగుతోంది. 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ ఎన్నికకు నల్గొండ జిల్లా కలెక్టర్‌ దాసరి హరిచందన రిటర్నింగ్‌ అధికారి(ఆర్వో)గా వ్యవహరిస్తున్నారు. జూన్‌ 5వ తేదీన కౌంటింగ్‌ ఉండనుంది. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 2021 మార్చిలో జరిగిన ఎన్నికలో బిఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

➡️