పింఛను పెంపు హర్షణీయం

ప్రజాశక్తి మదనపల్లె అర్బన్‌ విభిన్నన్రపాతిభావంతులకు పింఛను రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచడంపై గురువారం విహెచ్‌పిఎస్‌ చెవిటి మూగ సంఘం సభ్యులు, ఎంఆర్‌పిఎస్‌ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. పింఛను పెంపు కోసం పోరాడిన ఎంఆర్‌పిఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్‌బాషా చిత్ర పటాలకు పూలు జల్లి, పాలభిషేకం చేసి, స్వీట్స్‌ పంచి పెట్టారు. విహెచ్‌పిఎస్‌ మాజీ జిల్లా అధ్యక్షులు షేక్‌ మౌలాలి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఎస్‌పి జాతీయ నాయకులు నరేంద్ర బాబు మాదిగ, మౌలాలి, ఎంఆర్‌పిఎస్‌ జిల్లా అధ్యక్షులు రవి మాట్లాడుతూ విభిన్నన్రపాతిభావంతులకు పింఛను పెంపు కోసం మందకృష్ణ అలుపెరుగని పోరాటం చేశారన్నారు. ధరలు పెరిగిన నేపథ్యంలో ఇప్పుడిస్తున పింఛను రూ.3 వేలు చాలదని, రూ.6 వేలు ఇవ్వాలని చేసిన పోరాటాన్ని ఇప్పుడొచ్చిన ప్రభుత్వం మానవీయ కోణంలో అర్థం చేసుకుందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ పింఛను రూ.6 వేలకు పెంచడం పట్ల యావత్‌ వికలాంగుల సమాజం వీరి పట్ల కతజ్ఞతగా ఉంటుందని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని వికలాంగుల సమస్యల పరిష్కారానికై చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ల దష్టికి తీసుకెళ్లి పరిష్కారాలను సాధిస్తా మని తెలిపారు. విహెచ్‌పిఎస్‌ గ్రామ, మండల, జిల్లా స్థాయి నిర్మాణాలను పూర్తి చేసి, వికలాంగులను ఒక బలమైన శక్తిగా మారుస్తామని తెలిపారు. కార్యక్రమంలో విహెచ్‌ పిఎస్‌, చెవిటి మూగ సంఘం నాయకులు చంద్ర, సునీల్‌, రాజు, సుబ్రహ్మణ్యం, వెంకటేష్‌, మధు కుమార్‌, పప్పిరెడ్డి, రమణ, కిరణ్‌, పద్మనాభం, చంద్రశేఖర్‌, ఎంఎస్‌పి నాయకులు ఆరేటి మోహన్‌, కో-ఇన్‌ఛార్జి మొపూరి మనోహర్‌, ఎంఆర్‌పిఎస్‌ నాయకులు రమణ క్రిష్‌, నాగ, నాగరాజు పాల్గొన్నారు.

➡️