సెంట్రల్‌ నైజీరియాలో కాల్పులు.. 113 మంది మృతి

Dec 26,2023 10:31 #central Nigeria, #Death Row

సెంట్రల్‌ నైజీరియాలోని పలు గ్రామాల్లో సాయుధ మూకలు కాల్పులకు తెగబడ్డాయి. ఈ కాల్పుల్లో 113 మంది మరణించగా, మరో 300 మందికిపైగా గాయపడ్డారు. బండిట్స్‌గా పిలిచే మిలటరీ గ్యాంగ్‌లు.. 20 తెగలకు చెందిన ప్రజలే లక్ష్యంగా గ్రామాలపై కాల్పులకు పాల్పడినట్లు స్థానిక ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. మొదట ఆదివారం సాయంత్రం జరిగిన కాల్పుల్లో 16 మంది మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే సోమవారం కూడా కాల్పులు కొనసాగడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగిందని అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.

➡️