సముద్రంలో ఘోర ప్రమాదం.. 61 మంది వలసదారుల దుర్మరణం

61 migrants drown in shipwreck off Libya Drowning was the main cause of death

మృతుల్లో అత్యధికులు మహిళలు, పిల్లలే

ట్రిపోలి: సముద్రంలో ఘోర ప్రమాదం జరిగింది. మహిళలు, చినాురులు సహా మొత్తం 86 మందితో వెళ్తును పడవ బలమైన అలల తాకిడికి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 61 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. వారు బతికి ఉండే అవకాశం లేదని, మరణించి ఉంటారని లిబియా అధికారులు చెబుతునాురు. పడవలోని మరో 25 మందిని రెస్క్యూ టీమ్స్‌ సురక్షితంగా బయటికి తీసుకొచ్చాయి. ఆదివారం ఉదయం లిబియా తీరంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నైజీరియా, గాంబియా తదితర ఆఫ్రికా దేశాలకు చెందిన 86 మంది ఐరోపా దేశాలకువలస వెళ్లేందుకు లిబియా నుంచి పడవలో బయలుదేరారు. లిబియా తీరానికి సమీపంలో పడవ బోల్తా పడినట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన ‘ఇంటరుేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ మైగ్రేషన్‌ (ఐఒఎం) తెలిపింది. లిబియా పశ్చిమ తీరంలోని జువారా పట్టణ సమీపంలో బలమైన అలల తాకిడికి పడవ కొట్టుకుపోయినట్లు ఈ ప్రమాదం నుంచి బయటపడిన వారు వెల్లడించారు. ఇప్పుడు ప్రమాదం జరిగిన మధ్యధరా సముద్రంలోని ఈ మార్గంలో గతంలో కూడా పలు ప్రమాదాలు సంభవించాయి. మెరుగైన జీవితం కోసం చాలా మంది ఆఫ్రికా దేశాల నుంచి ఐరోపా దేశాలకు వలస వెళ్లేందుకుఈ మార్గానేు ఆశ్రయిస్తున్నారు. యుద్ధాలు, పేదరికం నేపథ్యంలో పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాల నుంచి ఏటా వేల మంది ఐరోపా దేశాలకు వలసపోతున్నారు. నియంత గఢాఫీ మరణానంతరం లిబియాలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆ భూభాగంపై ఎవరికీ సరైన నియంత్రణ లేకపోవటంతో యూరప్‌కు చేరుకోవాలనుకుంటున్న వారంతా లిబియా తీరం నుంచే బయల్దేరుతున్నారు. గడాఫీ మరణానంతరం కల్లోలంగా లిబియాతమ చమురు అవసరాలు, లాభాల కోసం లిబియా అధ్యక్షుడు గడాఫీతో యుద్ధం చేసి, హత్య చేసిన తరువాత ఆ దేశం పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. మానవ అక్రమ రవాణాదారులకు కూడా లిబియాలోని కల్లోల పరిస్థితులు అనుకూలంగా మారాయి. ఆరు దేశాలతో సరిహద్దులు పంచుకుంటున్న లిబియాలోకి ఆఫ్రికా దేశాల నుంచి వలసదారులు పోటెత్తుతున్నారు. వీరందరినీ ప్రమాదకరమైన పడవల్లో కుక్కి తీరం దాటిస్తుంటారు. ఎవరైనా పట్టుబడి తిరిగి లిబియాకు వస్తే ప్రభుత్వ నిరాశ్రయ కేంద్రాల్లో ఉంచుతున్నారు. వారినినిర్బంధ శ్రామికులుగా మారుస్తున్నారు. వారిపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. వారి నుంచి డబ్బును లాక్కుంటున్నారు.

➡️