రఫాపై ఇజ్రాయిల్‌ దాడిని తీవ్రంగా ఖండించిన ఆఫ్రికన్‌ యూనియన్‌

నైరోబి  :   గాజా దక్షిణ నగరమైన రఫాపై ఇజ్రాయిల్‌ దాడిని ఆఫ్రికన్‌ యూనియన్‌ తీవ్రంగా  ఖండించింది. ఈ ఘోరమైన చర్యలను అంతర్జాతీయ సమాజం అడ్డుకోవాలని బుధవారం  పిలుపునిచ్చింది. పాలస్తీనా భూభాగానికి మానవతా సాయాన్ని అందించే కీలకమైన రెండు కారిడార్‌ల్లోకి ఇజ్రాయిల్‌ యుద్ధ ట్యాంకులను పంపి మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ యుద్ధం రఫా క్రాసింగ్‌కు చేరుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎయు కమిషన్‌ చీఫ్‌ మౌసా ఫకి మహ్మత్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గాజాపై ఇజ్రాయిల్‌ చేపట్టిన యుద్ధంతో ప్రతి క్షణం భారీ మరణాలు నమోదవుతున్నాయని ఫకీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మానవ జీవన పరిస్థితలపై క్రమబద్ధమైన విధ్వంసంగా ఆప్రకటనలో తెలిపారు.   భయంకరమైన దాడులను అడ్డుకునేందుకు సమిష్టి చర్యను సమర్థవంతంగా సమన్వయం చేయాలని మొత్తం అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు.

➡️