రష్యా విమర్శలను తోసిపుచ్చిన అమెరికా

వాషింగ్టన్‌ :    భారత సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో అమెరికా జోక్యం చేసుకుంటుందన్న రష్యా విమర్శలను అమెరికా గురువారం తోసిపుచ్చింది. తాము భారత దేశ లోక్‌సభ ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం లేదని అమెరికాస్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ పేర్కొన్నారు. ప్రపంచంలోని ఏ ఎన్నికల్లో తాము జోక్యం చేసుకోనట్లే.. భారత్‌ ఎన్నికల్లోనూ జోక్యం చేసుకోవడం లేదని అన్నారు. భారత దేశ ప్రజలు తీసుకోవాల్సిన నిర్ణయమని రోజువారీ మీడియా కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నారు. వాషింగ్టన్‌ పోస్ట్‌లో ప్రచురితమైన వార్తాకథనం పూర్తిగా ఆరోపణలతో నిండి ఉందని అన్నారు. జ్యూరీ నిర్థారించేంతవరకు అవి ఆరోపణలేనని అన్నారు. వాటిపై మాట్లాడనని, చట్టపరమైన వ్యవహారం కొనసాగతుందని అన్నారు.

భారత ఆంతరంగిక వ్యవహారాల్లో, ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో అమెరికా జోక్యం చేసుకుంటోందని రష్యా విమర్శించిన సంగతి తెలిసిందే.

➡️