ప్రముఖ ఇటాలియన్‌ తత్వవేత్త ఆంటోనియో నెగ్రీ మృతి

Dec 18,2023 16:31 #Antonio Negri, #Philosopher

 పారిస్‌  :     ప్రముఖ ఇటాలియన్‌ తత్వవేత్త ఆంటోనియో నెగ్రీ (90)  మరణించారు.  శనివారం పారిస్‌లోని నివాసంలో మరణించినట్లు ఆయన భార్య మరియు తత్వవేత్త జుడిత్‌ రెవెల్‌ సోమవారం ప్రకటించారు. సైద్ధాంతిక రచనలతో పాటు కార్మిక ఉద్యమాలలో చురుగ్గా పాల్గనేవారు. కార్మికుల కోసం  Potere   Operaio   (వర్కర్స్‌ పవర్‌ ) సంస్థను స్థాపించారు. నెగ్రీ రచించిన పుస్తకం ఎంపైర్‌ (ఎంపైర్‌) పలు విమర్శలను ఎదుర్కొంది.

నెగ్రీ ఆగష్టు 1, 1933న ఇటలీలోని పాడువాలో జన్మించాడు. అతను పాడువా మరియు పారిస్‌ విశ్వవిద్యాలయాలలో ప్రొఫెసర్‌. నెగ్రీ 1956లో ఇటాలియన్‌ సోషలిస్ట్‌ పార్టీలో సభ్యుడయ్యాడు. 1969లో ‘పొట్టెరే ఒపెరాయో’ అనే రాజకీయ  పార్టీలో  చేరాడు.     1973లో స్థాపించిన ఈ సంస్థ అనంతరం రద్దు చేయబడింది.  తీవ్రవాద సంస్థ రెడ్‌ బ్రిగేడ్‌తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై నెగ్రీని అరెస్టయ్యాడు.    1978లో క్రిస్టియన్‌ డెమోక్రటిక్‌ పార్టీ నాయకుడు ఆల్డో మోరోను కిడ్నాప్‌ చేసి హత్య చేయడంతో సహా అనేక ఆరోపణలపై 13 సంవత్సరాలకు పైగా జైలు శిక్ష అనుభవించారు.

➡️