ఎన్నికలకు ముందు పాకిస్థాన్‌లో పేలుడు .. 12 మంది మృతి

Feb 7,2024 15:54 #Bomb Blast, #Pakistan elections

ఇస్లామాబాద్‌ :    పాకిస్థాన్‌లోని నైరుతి ప్రావిన్స్‌లోని బలూచిస్థాన్‌లో ఎన్నికల అభ్యర్థి కార్యాలయం సమీపంలో బుధవారం పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో 12 మంది మరణించగా, సుమారు 24 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. పాకిస్థాన్‌లో గురువారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భద్రతపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థి కార్యాలయం సమీపంలో పేలుడు జరిగిందని, దీంతో పోలింగ్‌ బూత్‌ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశామని అధికారులు తెలిపారు. అయితే ఈ దాడివెనుక బాధ్యులు ఎవరన్న విషయంపై స్పష్టత రాలేదని అన్నారు. ఇస్లామిస్ట్‌ మిలిటెంట్‌ పాకిస్థాన్‌ తాలిబన్‌, బలూచిస్థాన్‌ నుండి వచ్చిన వేర్పాటువాద సంస్థలు సహా అనేక పాకిస్థాన్‌ను వ్యతిరేకిస్తూ ఇటీవలి నెలల్లో దాడులు చేపట్టాయి. ఎన్నికల నిబంధనల ప్రకారం.. రాజకీయపార్టీలు ప్రచారాన్ని ముగించిన అనంతరం ఈ దాడి జరిగిందని అన్నారు.

➡️