గ్రీస్‌ తీరంలో మునిగిన కార్గో నౌక : నలుగురు భారతీయులు సహా 13 మంది గల్లంతు

ఏథెన్స్‌ : గ్రీస్‌ తీరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో బలమైన గాలుల కారణంగా అల్లకల్లోల పరిస్థితుల్లో కార్గో నౌక మునిగిపోవడంతో 13 మంది గల్లంతయ్యారు. వీరిలో నలుగురు భారతీయులున్నారు. ప్రమాద సమయంలో నౌకలో మొత్తం 14 మంది సిబ్బంది ఉన్నట్లు తెలిసింది. వీరిలో ఒకరిని సహాయక సిబ్బంది రక్షించారు. మిగిలిన 13 మంది కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈజిప్టులోని అలెగ్జాండ్రియా నుంచి రాప్టర్‌ అనే కార్గో నౌక.. ఆరు వేల టన్నుల ఉప్పుతో తుర్కియే లోని ఇస్తాంబుల్‌ బయలుదేరింది. మార్గం మధ్య లో ఆదివారం ఉదయం ఏడు గంటలకు నౌకలో సాంకేతిక సమస్య తలెత్తిన విషయాన్ని గుర్తించిన సిబ్బంది వెంటనే సమీప కేంద్రానికి ప్రమాద సంకేతాన్ని పంపించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ నౌక కనిపించకుండా పోయినట్లు స్థానిక కోస్ట్‌ గార్డ్‌ వెల్లడించింది. రంగంలోకి దిగిన రెస్య్క్యూ బృందాలు ముమ్మర గాలింపు మొదలుపెట్టాయి.

➡️