పాలస్తీనాకు సంఘీభావంగా బెత్లెహాంలో క్రిస్మస్‌ వేడుకలు రద్దు 

Dec 26,2023 11:01 #Bethlehem, #Christmas, #Palestine

  బెత్లెహాం :    క్రిస్మస్‌ రోజున లక్షలాది మంది పర్యాటకులతో కిటకిటలాడే పవిత్ర నగరం బెత్లహామ్‌ ఈ సారి బోసిపోయింది. పాలస్తీనాకు సంఘీభావంగా ఏసు క్రీస్తు జన్మ స్థలమైన బెత్లెహామ్‌లో క్రిస్మస్‌ వేడుకలను రద్దు చేస్తున్నట్లు స్థానిక అధికారులు ప్రకటించారు. గాజాపై ఇజ్రాయిల్‌ దురాక్రమణపూరిత దాడులు కొనసాగిస్తుండడాన్ని బెత్లెహాం వాసులు నిరసించారు. ఈ పరిస్థితుల్లో బెత్లహాం అంతటా ఉన్న చర్చిల నాయకులు ఈ సంవత్సరం క్రిస్మస్‌ వేడుకలు జరుపుకోరాదని నిర్ణయించినట్లు మేయర్‌ హన్నా హనానియా వివరించారు. ”ఏసు జననం ప్రపంచంలోని పిల్లలందరికీ శాంతి, సుఖ సందేశాన్ని ఇవ్వాలి. కానీ, గాజాస్ట్రిప్‌లో వేలాది మంది పిల్లలు అమానుషంగా చంపబడుతున్నప్పుడు మేము క్రిస్మస్‌ వేడుకలను జరుపుకోలేము ”అని హనానియన్‌ పేర్కొన్నారు.

➡️