బంగ్లాదేశ్‌లో 5.6 తీవ్రతతో భూకంపం

Dec 2,2023 12:05 #Bangladesh, #Earthquake

 

ఢాకా : బంగ్లాదేశ్‌లో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.6గా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ సెంటర్‌ సామాజిక మాధ్యమం ఎక్స్‌ (ట్విట్టర్‌) ద్వారా పేర్కొంది. ఇక ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. శనివారం ఉదయం 9:05 గంటలకు భూకంపం సంభవించింది. వెడల్పు : 23.15, పొడవు : 90.89, 55 కిలోమీటర్ల లోతులో భూప్రకంపనలు సంభవించినట్లు ఎన్‌సిఎస్‌ ట్వీట్‌లో పేర్కొంది. అయితే భూకంపం వల్ల ఆస్తి, ప్రాణ నష్టాలకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా, భారత్‌లోని డెహ్రాడూన్‌లో శనివారం ఉదయం 3.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈమేరకు సమాచారాన్ని ఎన్‌సిఎస్‌ ఎక్స్‌లో పోస్టు చేసింది. 35.44 వెడ్పులు, 77.36 పొడవు, 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించినట్లు ఎన్‌సిఎస్‌ తెలిపింది.

➡️