పండుగ రోజున ఘోర ప్రమాదం – ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

బీహార్‌ : హోలీ పండుగ రోజున బీహార్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి గుంటలో బోల్తాపడటంతో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి.

హోలీ పండుగ సందర్భంగా … దల్సింగ్‌సరాయ్ నుంచి బెగుసరాయ్ వైపుగా… ముజఫర్‌పూర్‌ నుండి జాముయికి కారులో కుటుంబం బయలుదేరింది. బచ్వారా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఝమ్తియా జాతీయ రహదారి 28 సమీపంలో వస్తుండగా కారు అదుపుతప్పి గుంటలో బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో కారులో ఉన్న ముగ్గురు చనిపోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడినవారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. మృతులను ముజఫర్‌పూర్‌ జిల్లాకు చెందిన సుధీర్‌ కుమార్‌ భార్య అర్చన దేవి, వారి కుమార్తె నమ్రత కుమారి, మరో మహిళగా గుర్తించారు. గాయపడినవారిలో తండ్రి, కొడుకు, డ్రైవర్‌ ఉన్నారు. ముగ్గురిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరంతా దల్సింగ్‌సరాయ్ నుంచి బెగుసరాయ్ వైపు కారులో వెళుతున్నారని ప్రమాద ప్రత్యక్ష సాక్షి అమర్జీత్‌ యాదవ్‌ తెలిపారు. ఈ ఘటన గురించి కుటుంబ సభ్యుడు గౌతమ్‌ కుమార్‌ మాట్లాడుతూ … ముజఫర్‌పూర్‌ నుండి అంతా కారులో జాముయికి వెళుతున్నారని, ఈ ప్రమాదం బచ్వారా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిందని తెలిపారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సదర్‌ ఆస్పత్రికి తరలించారు. తదుపరి చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️