Hajj Pilgrims : హజ్‌ యాత్రలో మృత్యువాత

  • వడగాడ్పులు తట్టుకోలేక 68 మంది భారతీయులు సహా 645 మంది మృతి

రియాద్‌ : హజ్‌ యాత్రకు వెళ్లిన 645 మంది వడగాడ్పులు, అధిక ఉష్ణోగ్రతలు తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయారు. వారిలో 68 మంది భారతీయలు ఉన్నట్లు సౌదీ అరేబియాకు చెందిన దౌత్యవేత్త ఒకరు బుధవారం వెల్లడించారు. హజ్‌ యాత్రలో సుమారు 550 మరణించినట్లు అధికారిక వర్గాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. హజ్‌ యాత్రికుల్లో 68 మంది భారతీయులు మరణించగా, వీరిలో అత్యధికులు పెద్దవయసు వారేనని తెలిపారు. కొంతమంది సాధారణ అనారోగ్య పరిస్థితులతో, మరికొంత మంది వాతావరణ పరిస్థితుల కారణంగా మరణించినట్లు భావిస్తున్నామని ఆయన వివరించారు. మృతుల్లో 323 మంది ఈజిప్షియన్లు, 60 మంది జోర్డాన్లతో పాటు సెనెగల్‌, ట్యునీషియా, ఇరాక్‌, ఇండోనేషియా, ఇరాన్‌ దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారని అన్నారు. అధిక ఉష్ణోగ్రతలు, తీవ్ర ఉక్కబోత కారణంగా పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, ఆదివారం ఒక్కరోజే 2,700 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయని సౌదీ అరేబియా పేర్కొంది. గతేడాది 200కు పైగా హజ్‌ యాత్రికులు మరణించిన సంగతి తెలిసిందే.

➡️