పారిస్‌ ప్రతిపాదనలపై హమాస్‌ అధ్యయనం

Feb 28,2024 12:08 #Hamas, #Paris Proposals, #Study
  • రంజాన్‌కల్లా కాల్పుల విరమణ ఒప్పందం !

గాజా : గాజాలో కాల్పుల విరమణ, బందీల మార్పిడి ఒప్పందం కోసం పారిస్‌లో చర్చల సందర్భంగా ఇజ్రాయిల్‌, అమెరికా, ఖతార్‌, ఈజిప్ట్‌లు చేసిన ప్రతి పాదనలపై హమాస్‌ అధ్యయనం చేస్తోంది. దీనిపై ఇంకా అధికారికంగా ఎలాంటి వ్యాఖ్యలు వెలువడలేదు. వారం రోజుల్లోగా కాల్పులకు విరమణ వుంటుందని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ సూచనప్రాయంగా చెప్పారు. ఆరు వారాల పాటు కాల్పుల విరమణ జరగాలని, ఈ కాలంలో హమాస్‌ అదుపులో వున్న 40మంది బందీ లను విడుదల చేసేందుకు అనుమతించాలని, అందుకు ప్రతిగా ఇజ్రాయిల్‌ జైళ్లలో మగ్గుతున్న దాదాపు 400 మంది పాలస్తీనియన్లను విడుదల చేయాలన్న డిమాండ్లు ఈ ప్రతిపాదనల్లో వున్నాయి. ఖైదీల్లో మహిళలు, పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు కూడా వున్నారు. రోజుకు 8 గంటల పాటు ఇజ్రాయిల్‌ మిలటరీ వైమానిక నిఘాను నిలిపివేయాలన్న ప్రతిపాదన కూడా ఇందులో వుంది. అదే సమయంలో గాజాలోకి పంపే మానవతా సాయం గణనీయంగా పెరగాలని, రోజుకు 500 ట్రక్కుల సాయాన్ని అనుమతించాల్సి వుందని మీడియా వార్తలు పేర్కొంటున్నా యి. యుద్ధ భయంతో చెల్లాచెదురై ఇతర ప్రాంతాలకు శరణార్థులుగా వెళ్లిపోయిన పాలస్తీనియన్లందరూ తిరిగి తమ నివాసా లకు వచ్చేందుకు అనుమతించాలని హమాస్‌ డిమాండ్‌ చేస్తోంది. ఖతార్‌ రాజధాని దోహాలో ఇజ్రాయిల్‌, హమాస్‌ ప్రతినిధి బృందాలు వేర్వేరుగా చర్చలు జరుపుతున్నాయి. మార్చి 10లోగా అంటే రంజాన్‌ మాసం ప్రారంభం కావడానికి ముందేకాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చే అవకాశాలు వున్నాయని మధ్యవర్తులు భావిస్తున్నారు. ఇజ్రాయిల్‌, హమాస్‌ మధ్య మార్చి 4వ తేదీకల్లా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే అవకాశం వుందని భావిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తెలిపారు. న్యూయార్క్‌ పర్యటన సందర్భంగా బైడెన్‌ మీడియాతో మాట్లాడుతూ, బందీలను విడిపించేందుకు, గాజాకు మానవతా సాయం అందేలా చూసేందుకు ఈ ఒప్పందం వెసులుబాటు కల్పిస్తుందని అన్నారు.ఇజ్రాయిల్‌ సైనికుల లూటీలు గాజాలో పౌర నివాస ప్రాంతాలపై ఇజ్రాయిల్‌ సైన్యం దాడులు జరుపుతూ విధ్వంసాన్ని సృష్టించడమే గాక, వారి ఇళ్లల్లో లూటీలకు కూడా పాల్పడుతోంది. ఇదేదో ఘనకార్యం సాధించినట్లుగా ఇందుకు సంబంధిం చిన వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నా రు. ఇటువంటి కొన్ని వీడియో క్లిప్‌లను దక్షిణాఫ్రికా అంతర్జాతీయ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. ఇజ్రా యిల్‌ను యుద్ధ నేరస్థ దేశంగా ప్రకటించాలని కోరింది. తన తండ్రి తనకు 15ఏళ్ల క్రితం కొనిపెట్టిన గిటార్‌ను వాయిస్తూ ఒక సైనికుడు చేసిన టిక్‌టాక్‌ వీడియోను చూసి నవంబరులో పాలస్తీనియన్‌ గాయకుడు హమదా నస్రల్లా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

➡️