మరోసారి యుఎఇని ముంచెత్తిన భారీ వర్షాలు.. పలు విమానాలు రద్దు

అబుదాబి :    యుఎఇని భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన ముంచెత్తింది. దీంతో ప్రతికూల వాతావరణం కారణంగా పలు అంతర్జాతీయ విమానాలను రద్దు చేసినట్లు ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌ గురువారం ప్రకటించింది. దేశంలోని తాజా పరిస్థితులను ఎదుర్కోవడానికి అధికారులు సంసిద్ధంగా ఉండాలని నేషనల్‌ ఎమర్జెన్సీ క్రైసిస్‌ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (ఎన్‌సిఇఎంఎ) ఆదేశించింది. గత నెల కురిసిన వర్షాల కన్నా తక్కువ వర్షం కురిసిందని అంచనా వేసింది.

ప్రధాన నగరాల్లో భారీగాలులు, తేలికపాటి వర్షాలు కురుస్తుండటంతో  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అంతర్గత మంత్రిత్వ శాఖ  హెచ్చరించింది.  భారీ వరదలు ముంచెత్తడంతో పలు రహదారులను మూసివేశారు.  రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లో ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించేలా చూడాలని తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అవకాశం కల్పించాలని ఆదేశించింది.

గత నెల 14-15 తేదీల్లో దుబారుని భారీ వర్షాలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఒమన్‌లో కురిసిన భారీ వర్షాలకు 18 మంది మరణించారు.

➡️