ఇజ్రాయిల్‌ ఊచకోతపై బైడెన్‌ వైఖరిని నిరసిస్తూ వాషింగ్టన్‌లో 4లక్షల మందితో భారీ ర్యాలీ

Jan 17,2024 11:00 #raly, #Washington

వాషింగ్టన్‌: పాలస్తీనాకు సంఘీ భావంంగా బైడెన్‌ గుమ్మానికి అతి చేరువలో నాలుగు లక్షల మంది గత వారం చివరిలో మార్చ్‌ నిర్వహించారు. ఫ్రీడమ్‌ ప్లాజా ఇందుకు వేదికగా నిలిచింది. య ఎమెన్‌, దక్షిణాఫ్రికా, ప్యూర్టోరికా జెండాలు పట్టుకుని సంఘీభావ ఉద్యమ కార్యకర్తలు వాషింగ్టన్‌లోని అధ్యక్ష భవనం మీదుగా ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శ,నకు ప్రజలను పెద్దయెత్తున సమీకరించడంలో పాలస్తీనాకు సంబంధించిన అమెరికన్‌ ముస్లిం టాస్క్‌ ఫోర్స్‌, అమెరికన్‌ ఇస్లామిక్‌ సంబంధాల మండలి, ఉత్తర అమెరికా ఇస్లామిక్‌ సర్కిల్‌, ముస్లిం అమెరికన్‌ సొసైటీ, ముస్లిం స్టూడెంట్స్‌ అసోసియేషన్‌, నేషనల్‌ ముస్లిం లీగ్‌ ఫండ్‌ ఆఫ్‌ అమెరికా, ముస్లిం ఉమ్మాహ్ ఆఫ్‌ నార్త్‌ అమెరికా, యంగ్‌ ముస్లిమ్స్‌, ఆన్సర్‌ కొయిలేషన్‌ ప్రధాన భూమిక వహించాయి. గాజలో ఇజ్రాయిల్‌ ఊచకోతను బైడెన్‌ వెనకేసుకురావడాన్ని ప్రదర్శకులు తీవ్రంగా నిరసించారు. అధ్యక్ష భవన పరిసరాల్లో బైడెన్‌ విధానాలకు వ్యతిరేకంగా వారు బిగ్గరగా నినదించారు. యెమెన్‌పై అమెరికా, బ్రిటన్‌ బాంబు దాడులకు వ్యతిరేకంగా వారు గళమెత్తారు. ఇజ్రాయిల్‌ ఊచకోతకు వ్యతిరేకంగా యెమెన్‌ ఇజ్రాయిలీ నౌకలను అడ్డుకుందని, దీనినే నేరం, ఘోరం అన్నట్టుగా అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు యాగీ చేస్తున్నాయని అన్నారు. నెత్తురోడుతున్న చిన్నారుల బొమ్మలను వారు అధ్యక్ష భవనం గేటు వద్ద ప్రదర్శించారు. ఇజ్రాయిల్‌ ఊచకోతలో ఇప్పటివరకు 10 వేల మంది పిల్లలు చనిపోయారు. గాజాలో ఇజ్రాయిల్‌ రాక్షసత్వానికి వంద రోజులు అయిన సందర్భంగా దక్షిణాఫ్రికా, జపాన్‌, టర్కీ, బ్రిటన్‌, దక్షిణ కొరియా, ఇండొనేషియా, ఐర్లండ్‌, న్యూజిలాండ్‌, ఐవరీ కోస్ట్‌, స్వీడెన్‌, జర్మనీ, ఇటలీ, ఆస్ట్రేలియా, ఫిన్లాండ్‌ తదితర దేశాల్లోని ప్రధాన నగరాలు, పట్టణాల్లోను, అమెరికా అంతటా పాలస్తీనా సంఘీభావ ర్యాలీలు జరిగాయి. 2004 ఎన్నికల సంవత్సరం కావడంతో అమెరికాలో పోటెత్తుతున్న ఈ నిరసన ప్రరద్శనలు బైడెన్‌ పుట్టి ముంచేలా ఉన్నాయని అమెరికన్‌ ప్రధాన మీడియా ఆందోళన చెందుతోంది. అమెరికన్ల సమస్యలపై దృష్టి పెట్టడానికి బదులు, పన్నుల రూపంలో చెల్లించే మా డబ్బును విద్వేషాలు, యుద్ధాలు, ఇతర నేరపూరిత చర్యలు సూటిగా చెప్పాలంటే ఇటువంటి ఊచకోతలకు ప్రభుత్వం వెచ్చిస్తోన్నదని చికాగో నుండి వచ్చిన ప్రదర్శకుడు మహ్మద్‌ షబ్రి పేర్కొన్నారు. బైడెన్‌ పాపులారిటి గణనీయంగా పడిపోవడంతో వచ్చే ఎన్నికల్లో మూడవ పార్టీ అభ్యర్థి ప్రాముఖ్యత పెరిగింది. పాలస్తీనియన్లపై ఊచకోతను సమర్థించే ఏ అభ్యర్థికి ఓటెయ్యరాదని సోషలిజం, లిబరేషన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డీ లా క్రజ్‌ పేర్కొన్నారు.

➡️