కెనడా ఎన్నికల్లో భారత్‌ జోక్యం – తెరపైకి కొత్త వివాదం

ఒట్టావా : భారత్‌-కెనడాల మధ్య నిజ్జర్‌ హత్య విషయంలో ఇప్పటికే దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్న వేళ.. తెరపైకి మరో కొత్త వివాదం వచ్చింది. కెనడా ఎన్నికల్లో విదేశీ జోక్యంపై జరుగుతోన్న దర్యాప్తులో భారత్‌ పేరునూ ఆ దేశ ప్రభుత్వం చేర్చింది. కెనడా ఎన్నికలను ప్రభావితం చేసేందుకు చైనా యత్నించిందంటూ వెలువడిన కథనాల నేపథ్యంలో వాటిపై విచారణ నిమిత్తం ట్రూడో ప్రభుత్వం గత సెప్టెంబర్‌లో ఒక స్వతంత్ర కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పుడు భారత్‌ పేరును ఆ దర్యాప్తులో చేర్చారు.

➡️