అణుబాంబుపై ఇరాన్‌ కీలక వ్యాఖ్యలు

May 12,2024 12:41 #Iran, #Israel, #Nuclear Bomb

టెహ్రాన్‌ :    అణుబాంబు తయారీపై ప్రత్యేకించి ఇజ్రాయిల్‌తో పెరుగుతున్న ఆందోళనలపై ఇరాన్‌ సుప్రీం నేత అయాతుల్లా అలీ ఖమేనీ కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీం లీడర్‌ సలహాదారు కమాల్‌ ఖర్రాజీ మాట్లాడుతూ.. తమ దేశం అవసరమైతే అణువిధానం మార్చుకొనేందుకు ఏ మాత్రం వెనుకాడదని సుప్రీం నేత సలహాదారు కమాల్‌ ఖర్రాజీ పేర్కొన్నారు. అణుబాంబు తయారు చేయాలని తాము నిర్ణయించుకోలేదని, అయితే ఇరాన్‌ ఉనికికి ముప్పు వాటిల్లితే, తమ సైనిక సిద్ధాంతాన్ని మార్చడం తప్ప వేరే మార్గం లేదని ఖర్రాజీ పేర్కొన్నారు. సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్‌ రాయబార కార్యాలయంపై బాంబు దాడితో ఇరాన్‌, ఇజ్రాయిల్‌ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైన సంగతి తెలిసిందే. ఇజ్రాయిల్‌ తమ అణుకేంద్రాలపై దాడి చేసిన సందర్భంలో.. తమ దాడి తీరు మారుతుందని ఖర్రాజీ పేర్కొన్నారు.

➡️