22కి చేరిన ఇండోనేషియా అగ్నిపర్వత విస్ఫోటన మృతుల సంఖ్య

Dec 6,2023 12:27 #Indonesia, #volcano eruption

 జకార్తా :   ఇండోనేషియాలోని మరాపీ అగ్నిపర్వతం విస్ఫోటనం ఘటనలో మృతుల సంఖ్య 22కి పెరిగింది. అగ్నిపర్వతం సమీపంలో పలు మృతదేహాలను గుర్తించినట్లు మంగళవారం పశ్చిమ సుమత్రా రెస్క్యూ ఏజెన్సీ అధ్యక్షుడు తెలిపారు. ఇండోనేషియాలోని మౌంట్‌ మరాపీ అగ్నిపర్వతం ఆదివారం రాత్రి విస్ఫోటనం చెందిన సంగతి తెలిసిందే. గల్లంతైన ఓ పర్వతారోహకుడి కోసం సుమారు 200 మంది రక్షక బృందాలు గాలింపుచర్యలను బుధవారం పున: ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. తాము ప్రస్తుతం అగ్నిపర్వతం సమీపంలో పడి ఉన్న మృతదేహాలను తరలిస్తున్నామని సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ టీమ్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ మాలిక్‌ తెలిపారు.

సుమత్రా ద్వీపంలోని మరాపి అత్యంత చురుకైన అగ్నిపర్వతాల్లో ఒకటి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో విస్ఫోటనం చెందింది. మరాపీ పర్వత శిఖరానికి మూడు కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉన్న ప్రాంతానికి పర్వతారోహకులను వెళ్లకుండా నిరోధించాలని కోరుతూ స్థానిక పరిరక్షణ ఏజన్సీ, పర్యావరణ మంత్రిత్వ శాఖలకు ఇండోనేషియా అగ్నిపర్వత ఏజన్సీ 2011 నుండి పలు మార్లు లేఖలు పంపుతూనే ఉంది. ఘటన జరిగిన సమయంలోనూ పర్వతంపై 75 మంది హైకర్స్‌ ఉన్నట్లు సహాయక బృందం పేర్కొంది.

➡️