Pakistan : పంజాబ్‌ తొలి మహిళా సిఎంగా చరిత్ర సృష్టించిన మర్యమ్‌ నవాజ్‌

పంజాబ్‌ (పాకిస్తాన్‌) : పాక్‌ పంజాబ్‌ తొలి మహిళా సిఎంగా మరియం నవాజ్‌పంజాబ్‌ (పాకిస్తాన్‌) : పాకిస్తాన్‌లోని పంజాబ్‌ రాష్ట్రానికి తొలి మహిళ ాముఖ్యమంత్రిగా పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌ – నవాజ్‌ (పిఎంఎల్‌-ఎన్‌) పార్టీ నాయకురాలు మరియమ్‌ నవాజ్‌ సోమవారం పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఆమె మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కుమార్తె. ఆ పార్టీ ఉపాధ్యక్షురాలు కూడా. పిటిఐ మద్దతుతో గెలిచి, ఎస్‌ఐసి లో విలీనమైన ఇండిపెండెంట్లు ఈ ప్రమాణ స్వీకారాన్ని బహిష్కరించారు. ఫిబ్రవరి 8న జరిగిన ఎన్నికల్లో 800 ఓట్ల తేడాతో మరియం ఓడిపోయారు. ‘ఓడిపోయిన అభ్యర్థి సిఎం అయ్యారంటూ పిటిఐ-ఎస్‌ఐసి సభ్యులు విమర్శించారు. 2012లో మరియం రాజకీయ రంగ ప్రవేశం చేశారు.

➡️