ఇమ్రాన్‌ఖాన్‌ పిటిషన్‌ను తిప్పిపంపిన పాకిస్థాన్‌ సుప్రీంకోర్టు

ఇస్లామాబాద్‌ :    తోషాఖానా అవినీతి కేసులో పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బతగిలింది. మూడేళ్ల శిక్షను రద్దు చేయాలన్న ఇమ్రాన్‌ఖాన్‌ అప్పీల్‌ను సుప్రీంకోర్టు కార్యాలయం తిప్పి పంపినట్లు స్థానిక మీడియా ఆదివారం తెలిపింది. 2023, డిసెంబర్‌ 11న ఇస్లామాబాద్‌ హైకోర్టు (ఐహెచ్‌సి) ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 185 ప్రకారం ఇమ్రాన్‌ఖాన్‌ కౌన్సిల్‌ లతీఫ్‌ ఖోశా దాఖలు చేసిన అప్పీల్‌ను శనివారం రిజిస్టార్‌ కార్యాలయం తిప్పి పంపింది. వాస్తవ వివాదాలు లేదా గత వ్యాజ్యం కాలక్రమానికి అనుసరించి పిటిషన్‌ లేదని పేర్కొంది. ప్రభుత్వ బహుమతులను చట్టవిరుద్ధంగా విక్రయించినందుకు ఐహెచ్‌సి అదనపు సెషన్స్‌ జడ్జి ఈ ఏడాది ఆగస్టు ఐదున ఇమ్రాన్‌ఖాన్‌కు మూడేళ్ల జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. తోఫాఖానా లేదా రాష్ట్ర రిపోజిటరీ నిబంధనలను మాజీ ప్రధాని ఉల్లంఘించారంటూ తోషాఖానా కేసు నమోదైంది.

➡️