యూరోను స్వీకరించేందుకు సిద్ధంగా లేదు : పోలాండ్‌ ఆర్థిక మంత్రి

Apr 30,2024 17:28 #euro currency, #European Union, #Poland

వార్సా :    తమ దేశం ఇప్పటికీ యూరో కరెన్సీని స్వీకరించేందుకు సిద్ధంగా లేదని పోలాండ్‌ ఆర్థిక మంత్రి తెలిపారు. పోలాండ్‌ 2004లో యూరోపియన్‌ యూనియన్‌ (ఇయు)లో చేరిన సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి డోనాల్ట్‌ టస్క్‌ క్యాబినెట్‌లోని ఆర్థిక మంత్రి ఆండ్రెజ్‌ డొమిన్క్సీ సోమవారం స్థానిక మీడియాతో మాట్లాడారు. పోలాండ్‌ యూరోజోన్‌లో చేరనుందని, అయితే 20 మంది ఇయు సభ్యులతో కూడిన కరెన్సీ యూనియన్‌ ఈ సమయంలో సమర్థించబోరని అన్నారు.  ప్రపంచం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న సమయంలో తమ దేశ సొంత కరెన్సీ, జ్లోటీతో మాంద్యాన్ని నివారించడానికి, ఇతర షాక్‌లను ఎదుర్కోవడానికి సహాయపడిందని అన్నారు.

ఇయులో చేరి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మే 1న పోలాండ్‌ సహా తొమ్మిది దేశాలు 20వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. సభ్యత్వం నిబంధనల ప్రకారం.. జ్లోటీని ఒకే యూరోపియన్‌ కరెన్సీతో మార్పు చేసేందుకు పోలాండ్‌ కట్టుబడి ఉంది.

➡️