కెనడాలో కూలిన విమానం.. ఆరుగురు మృతి

Jan 24,2024 12:00 #Canada, #plane crashes

 ఒట్టావా :   కార్మికులతో వెళుతున్న ఓ విమానం కుప్పకూలింది. కెనడాలోని నార్త్‌వెస్ట్‌ టెరిటరీస్‌లో జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మరణించినట్లు అధికారులు తెలిపారు.

రియో టింటో మైనింగ్‌ సంస్థకు చెందిన దియావిక్‌ వజ్రాల గని వద్దకు కొందరు కార్మికులతో పోర్ట్‌స్మిత్‌ నుంచి బుధవారం ఉదయం 8.50 గంటలకు  ఛార్టర్‌ ఫ్లైట్‌ బయలుదేరింది. టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే  ఛార్టర్ ఫ్లైట్‌కి    ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయి.  రన్‌వే చివర నుంచి కిలోమీటర్‌ పరిధిలో విమానం కుప్పకూలిందని అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో ఆరుగురు మృతి  చెందారు. దీంతో ఫోర్ట్‌ స్మిత్‌ నుండి అన్ని విమానాలను  తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు కెనడా రవాణా భద్రతా బోర్డు ప్రత్యేక బృందాన్ని  నియమించింది.

➡️