జపాన్‌ తీరంలో బోల్తా పడిన దక్షిణ కొరియా నౌక .. ఇద్దరు గల్లంతు

Mar 20,2024 14:57 #South Korea, #tanker capsizes

 టోక్యో :    దక్షిణ కొరియాకు చెందిన నౌక నైరుతి జపాన్‌కి సమీపంలోని ద్వీపంలో బోల్తాపడింది. బుధవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో 9 మంది సిబ్బందిని రక్షించామని, మరో ఇద్దరు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.   నౌకలో కోస్ట్‌గార్డ్‌తో పాటు దక్షిణ కొరియాకు చెందిన మరో వ్యక్తి, ఎనిమిది మంది ఇండోనేషియన్లు, ఓ చైనా వ్యక్తి  ఉన్నారు.

జపాన్‌లోని ముట్సూర్‌ ద్వీప సమీపంలో ఉన్న సమయంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవంటూ సమాచారం వచ్చిందని కోస్ట్‌గార్డ్‌ చెప్పారు. ఈ ద్వీపం టోక్యోకి 1,000 కిలోమీటర్లు దూరంలో, జపాన్‌లోని ప్రధాన ద్వీపం హొన్షుకి  నైరుతి భాగంలో  ఉన్నట్లు తెలిపారు. సహాయక సిబ్బంది అక్కడికి చేరుకునే సరికి నౌక పూర్తిగా మునిగిపోయిందని కోస్ట్‌గార్డ్‌ తెలిపారు.

నౌక ట్యాంకర్‌లో 980 టన్నుల యాక్రిలిక్‌ యాసిడ్‌ ఉన్నట్లు అధికారులు తెలిపారు. యాసిడ్‌ లీక్‌ కాలేదని అన్నారు. ఒకవేళ లీక్‌ అయితే చేపట్టవలసిన పర్యావరణ పరిరక్షణ చర్యలపై అధ్యయనం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. యాక్రిలిక్‌ యాసిడ్‌ ప్లాస్టిక్‌ ,  పెయింట్స్‌ తయారీలో వినియోగిస్తారు.   నౌక అడుగుభాగం నీటిలో తేలుతున్న దృశ్యాలు స్థానిక మీడియాలో కనిపించాయి.

➡️