ఎఐఎడిఎంకె గుర్తుపై విచారణ జూన్‌ 10కి వాయిదా

Mar 26,2024 00:38 #adjourned, #AIADMK symbol, #hearing

చెన్నై : ఎఐఎడిఎంకె గుర్తు ‘రెండు ఆకులు’ను ఉపయోగించకుండా నిషేధంతో పాటు సింగిల్‌ జడ్జి తనపై విధించిన ఇతర ఆంక్షలను సవాల్‌ను చేస్తూ ఆ పార్టీ బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం దాఖలు చేసిన మూడు పిటీషన్ల విచారణను మద్రాస్‌ హైకోర్టు జూన్‌ 10కి వాయిదా వేసింది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా గుర్తులపై గందరగోళం ఏర్పడకుండా ఉండటానికే విచారణను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. రెండు ఆకుల గుర్తు కోసం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించడానికి కూడా ఎలాంటి అభ్యంతరం లేదని పన్నీర్‌ సెల్వం తరుపు న్యాయవాది పి.హెచ్‌ అర్వింధ్‌కు ధర్మాసనం స్పష్టం చేసింది.
ఎఐఎడిఎంకె ‘రెండు ఆకులు’ గుర్తు, జెండా, లెటర్‌హెడ్‌ ఉపయోగించకుండా నిషేధిస్తూ సింగిల్‌ జడ్జి ధర్మాసనం ఈ నెల 18న తీర్పు ఇచ్చింది.

➡️