విభజన అనేది సంఘ్ పరివార్‌ డిఎన్‌ఎలోనే వుంది : బృందా కరత్‌

Mar 15,2024 00:28 #Brinda Karat

న్యూఢిల్లీ : ”విభజన అనేది సంఘ పరివార్‌ డిఎన్‌ఎలోనే వుంది. ఎన్‌ఆర్‌సి (జాతీయ పౌర పట్టిక), సిఎఎ (పౌరసత్వ సవరణ చట్టం)లు రెండూ భిన్నమైనవని, సిఎఎతో ఎన్‌ఆర్‌సికి ఎలాంటి సంబంధం లేదంటూ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలు అర్ధ రహితం”. ”సంఫ్‌ు పరివార్‌ డిఎన్‌ఎలోనే ఈ విభజన వుంది. విభజన లేకుండా వారు మనుగడ సాగించలేరు. మతం పేరుతో ప్రజలను చీల్చడం, విద్వేషాలను వ్యాప్తి చేయడమే వారి జీవిత లక్ష్యం. భారత ప్రజల మధ్య ఘర్షణలు సృష్టించడమే వారి జీవిత పరమావధి. సిఎఎను ఆమోదించిన ఐదేళ్ళ తర్వాత ఈ నిబంధనలను ఇప్పుడు తీసుకురావడంలోనే వారి దుర్బుద్ధి అర్ధమవుతోంది. లోక్‌సభ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో వున్నాయనగా ఈ నిబంధనలను ఎందుకు తీసుకువచ్చారు?” అని ఆమె ప్రశ్నించారు.

➡️