మహాశివరాత్రి ఊరేగింపులో కరెంట్‌ షాక్‌ : 14 మంది చిన్నారులకు అస్వస్థత

Mar 8,2024 15:00 #electric shock, #Rajasthan

న్యూఢిల్లీ : రాజస్థాన్‌లోని కోటాలో మహాశివరాత్రి ఊరేగింపులో 14 మంది చిన్నారులు విద్యుత్‌ షాక్‌కి గురయ్యారని పోలీసులు తెలిపారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని రాష్ట్ర ఆరోగ్యశాఖామంత్రి హీరాలాల్‌ నగర్‌ తెలిపారు. షాక్‌కి గురైన చిన్నారుల్ని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చినట్లు పోలీసులు తెలిపారు.

కాగా, ఈ ఘటనపై ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖామంత్రి హీరాలాల్‌ మాట్లాడుతూ.. ‘ఇది చాలా బాధాకరమైన సంఘటన. వీరిలో ఇద్దరు చిన్నారులకు తీవ్రంగా గాయాలయ్యాయి. వీరికి తగిన చికిత్స అందించడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాం. నిర్లక్ష్యం జరిగితే దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించాం’ అని ఆయన అన్నారు. ఇంకా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️