2020 ఢిల్లీ అల్లర్ల కేసులో ఉపా నిందితుడికి బెయిల్‌ నిరాకరించిన హైకోర్టు

Apr 23,2024 23:10 #Delhi High Court

న్యూఢిల్లీ: ఢిల్లీలో 2020 అల్లర్ల వెనుక పెద్ద కుట్ర ఉందని వ్యాఖ్యానించిన ఢిల్లీ హైకోర్టు ఈ కేసులో ఉపా కింద అభియోగాలు ఎదుర్కొంటున్న ఒక నిందితుడికి బెయిల్‌ ఇవ్వడానికి నిరాకరించింది. ఉపా కింద అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితుడు సలీం మాలిక్‌ సహ కుట్రదారుడు అని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయని జస్టిస్‌ సురేష్‌ కుమార్‌ కైత్‌ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. మంగళవారం ఆయన బెయిల్‌ పిటీషన్‌ను తిరస్కరించింది. సిఎఎ, ఎన్‌ఆర్‌సిలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్భంగా 2020 ఫిబ్రవరిలో దక్షిణ ఢిల్లీలో అల్లర్లు చెలరేగాయి. ఈ కేసులో సలీం మాలిక్‌, షర్జీల్‌ ఇమామ్‌, ఖలీద్‌ సైఫీ, ఉమర్‌ ఖలీద్‌లపై ఉపా చట్టంతో పాటు ఐపిసిలోని సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. జూన్‌ 2020లో సలీం మాలిక్‌ను అరెస్టు చేశారు. అక్టోబర్‌ 2022న ట్రయల్‌ కోర్టు సలీం మాలిక్‌ బెయిల్‌ పిటీషన్‌ను కొట్టివేసింది. దీంతో మాలిక్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

➡️