గుజరాత్‌లో భూకంపం

Dec 8,2023 12:57 #Earthquake

 

అహ్మదాబాద్‌ : గుజరాత్‌లో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై ఈ భూకంప తీవ్రత 3.9గా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ (ఎన్‌సిఎస్‌) సామాజిక మాధ్యమం ఎక్స్‌ ద్వారా వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో రాజ్‌కోట్‌ జిల్లాలో భూప్రకంపనలు సంభవించాయి. వెడల్పు 23.45, పొడవు : 70.42, 20 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని ఎన్‌సిఎస్‌ తన అధికారిక ఎక్స్‌లో పేర్కొంది.

కాగా, ఈరోజు మేఘాలయలో కూడా భూకంపం సంభవించింది. ఈరోజు ఉదయం 8.46 గంటల సమయంలో షిల్లాంగ్‌కి నైరుతిలో 18 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్లు ఎన్‌సిఎస్‌ ఎక్స్‌లో పోస్టు చేసింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 3.8గా నమోదైందని ఎన్‌సిఎస్‌ వెల్లడించింది. వెడల్పు : 25.47, పొడవు : 91.75, 14 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు ఎన్‌సిఎస్‌ పేర్కొంది. ఇక ఈ రెండు రాష్ట్రాల్లోనే కాదు.. ఈరోజు కర్ణాటకలో విజయపురా జిల్లాలో ఉదయం 6.52 గంటల సమయంలో భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్‌స్కేల్‌పై 3.1గా భూకంప తీవ్రత నమోదైందని ఎన్‌సిఎస్‌ తెలిపింది. ఈ భూకంపాలకు సంబంధించి ఆస్తి, ప్రాణ నష్టాలకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉందని ఎన్‌సిఎస్‌ పేర్కొంది.

➡️