సీఎం కేజ్రీవాల్‌ను చంపుతానని బెదిరింపులు….ఢిల్లీలో ఓ వ్యక్తి అరెస్టు

May 22,2024 12:30 #Arvind Kejriwal, #man arest, #warning

ప్రజాశక్తి-ఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను చంపుతానని బెదిరిస్తూ గ్రాఫిటీ వేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ టీవీ పుటేజీ ద్వారా నిందితుడిని గుర్తించి బుధవారం అరెస్టు చేశారు. ఆయనను బరేలీకి చెందిన అంకిత్‌ గోయల్‌గా గుర్తించారు. ఢిల్లీ పోలీసుల మెట్రో యూనిట్‌ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిందని, ప్రస్తుతం ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.
ఈ పరిణామంపై ఆప్‌ స్పందించింది. ఈ ఘటన వెనుక బీజేపీ హష్తం ఉందని ఆరోపించింది.ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం ఏడు నియోజకవర్గాల్లో ఓటమి పాలవుతుందన్న భయంతోనే ఈ చర్యలను పాల్పడుతున్నారని తెలిపింది.

➡️