ఓటు వేయడానికి ఆధార్‌ తప్పనిసరి కాదు : ఇసి స్పష్టీకరణ

Feb 27,2024 10:35 #election commision

న్యూఢిల్లీ : ఓటు వేయడానికి ఆధార్‌ కార్డు తప్పనిసరి కాదని ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసింది. ఆధార్‌ కార్డు లేదనే కారణంతో ఓటర్లను వారి ఓటు హక్కు వినియోగించుకోకుండా అడ్డుకోలేరని తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రతినిధి బృందానికి ఎన్నికల కమిషన్‌ సోమవారం హామీ ఇచ్చింది. ఓటర్‌ ఐడి కార్డు లేదా మరే గుర్తింపు పత్రాలనైనా చూపించి ఓటర్లు తమ ఓటు వేసుకోవచ్చని తెలిపింది. పశ్చిమ బెంగాల్‌లో అనేక ఆధార్‌ కార్డులు అమల్లో లేకపోవడం పట్ల టిఎంసి నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషనర్లతో భేటీ అనంతరం ప్రతినిధి బృందం విలేకర్లతో మాట్లాడింది. రాష్ట్రంలో వేలాదిమంది ప్రజల ఆధార్‌ కార్డులు పనిచేయకపోవడమో లేదా తొలగించడమో జరిగిరరందని, ఆ నేపథ్యంలోనే తాము కమిషన్‌ను కలిశామని, వారు హామీ ఇచ్చారని రాజ్యసభ నేత సుఖేందు శేఖర్‌ రే చెప్పారు. ఆర్థికంగా సున్నితమైన అంశాల పరిశీలనకు జిల్లా నిఘా కమిటీలను ఏర్పాటు చేయాలని కూడా ఎన్నికల కమిషన్‌ నిర్ణయించిందన్నారు. ఈ కమిటీలో రాష్ట్ర, కేంద్ర సంస్థల సభ్యులు వుంటారు. పోలీసులు, ఐటి, ఎక్సైజ్‌, జిఎస్‌టి, ఇడి అధికారులు కూడా సభ్యులుగా వుంటారు.

➡️