టిఎంసి బాటలోనే ఆప్‌ ..

 చండీగఢ్‌  :  తృణమూల్‌ కాంగ్రెస్‌ (టిఎంసి)   బాటలోనే  ఆప్ కూడా లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై  ప్రకటన విడుదల చేసింది.   పంజాబ్‌లోని అన్ని లోక్‌సభ స్థానాల్లోనూ ఒంటరిగానే పోటీ చేస్తామని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) బుధవారం  ప్రకటించింది. కాంగ్రెస్‌తో సీట్ల ఒప్పందం లేదని, లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని  టిఎంసి  అధ్యక్షురాలు, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఆప్‌ ప్రకటన కూడా వెలువడటం గమనార్హం.

పంజాబ్‌లోని 13 లోక్‌సభ స్థానాలకు 40 మంది అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేశామని ఆప్‌ తెలిపింది. అభ్యర్థులను ఖరారు చేయడానికి ముందు రాష్ట్రంలో సర్వే చేపడుతున్నామని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ బుధవారం ప్రకటించారు.

బెంగాల్‌లో లోక్‌సభ స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, కాంగ్రెస్‌తో ఎలాంటి ఒప్పంద లేదని మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల అనంతరం జాతీయ స్థాయిలో పొత్తుపై ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటామని స్పష్టం చేశారు.

➡️