సమస్యల కంటే అంబానీ వివాహ వేడుకకే ప్రాధాన్యం

Mar 5,2024 10:21 #Ambani, #Rahul Gandhi
  •  మీడియా తీరుపై రాహుల్‌గాంధీ విమర్శలు

భోపాల్‌ : శతకోటీశ్వరుడు ముకేష్‌ అంబానీ ఇంట జరిగే వివాహ వేడుకను చూపించడానికి దేశంలో ప్రధాన మీడియా స్రవంతికి సమయం ఉంది కానీ… రైతుల ఆందోళన, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలను చూపించ డానికి సమయం లేదని కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌ గాంధీ అన్నారు. మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో సోమవారం జరిగిన భారత్‌ జోడో న్యారు యాత్రలో ఆయన మాట్లాడారు. ‘ప్రస్తుతం దేశంలో అతి పెద్ద సమస్యలు నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అవినీతి. అయితే మీడియా ఎందుకు రోజంతా అంబానీ వివాహం గురించే చర్చి స్తోంది. ఎవరైనా నాకు వివరించండి’ అని రాహుల్‌ అన్నారు. ‘మీరు టీవి చూసి నప్పుడు మీకు బాలీవుడ్‌ నటులు, కొన్నిసార్లు క్రికెటర్లు కనిపిస్తారు. మీడియాపై మీకు నియంత్రణ లేని కారణంగానే మీ సమస్యలు గురించి మాట్లాడరు’ అని చెప్పారు. దేశంలోని ప్రధాన మీడియా స్రవంతి అంతా బడా పారిశ్రామికవేత్తల చేతిలోనే ఉందని విమర్శించారు. సోమవారం శివపురి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర తరువాత ప్రస్తుత కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రాబల్యం ఉన్న గుణ నియోజవర్గం మీదుగా సాగింది. 2019 లోక్‌సభ ఎన్నికల వరకూ కాంగ్రెస్‌లోనే ఉన్న జ్యోతిరాదిత్య సింధియా 2020 మార్చిలో బిజెపిలో చేరారు.

➡️