తమిళనాడులో 2 స్థానాలకు సిపిఎం అభ్యర్థుల ప్రకటన

  •  మదురైకి సాహిత్య అకాడమీ గ్రహీత ఎస్‌ వెంకటేశన్‌

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : తమిళనాడులో సిపిఎం పోటీ చేసే రెండు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. సిపిఎం తమిళనాడు రాష్ట్ర కమిటీ రెండు లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటిస్తూ ప్రకటన విడుదల చేసింది. మదురై నుంచి సాహిత్య అకాడమీ గ్రహీత, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, సిట్టింగ్‌ ఎంపి ఎస్‌ వెంకటేశన్‌ను మళ్లీ బరిలోకి దింపింది. దిండిగల్‌ నియోజకవర్గం అభ్యర్థిగా దిండిగల్‌ జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆర్‌ సచిదానందం పోటీ చేయనున్నారు.

➡️