కునో నేషనల్‌ పార్క్‌లో మరో చీతా మృతి

Jan 16,2024 18:30 #Cheetah, #death

భోపాల్‌: నమిబియా దేశం నుంచి తీసుకువచ్చిన మరో చితా ‘శౌర్య’ మధ్య ప్రదేశలోని కునో నేషనల్‌ పార్క్‌లో మృతి చెందింది. మంగళవారం 3.17 నిమిషాలకు ‘శౌర్య’ చీతా మరణించినట్లు ప్రాజెక్టు చీతా డైరెక్టర్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. చీతా మృతికి సంబంధించిన కారణాలు తెలియరాలేదన్నారు. చీతాకు పోస్ట్‌ మార్టం చేసి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ‘ప్రాజెక్టు చీతా’లో భాగంగా సెప్టెంబర్‌ 17, 2022న నమిబియా నుంచి 8 చీతాలు తీసుకువచ్చి కునో నేషనల్‌ పార్క్‌లో వదిలిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఫిబ్రవరి 18, 2023న మరో 12 చీతాలను దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చి కునో పార్క్‌లో విడిచిపెట్టారు. ఇప్పటివరకు ‘శౌర్య’తో మొత్తం 10 చీతాలు మృతి చెందటం గమనార్హం.

➡️