మోడీకి మరో గట్టి ఎదురు దెబ్బ

న్యూఢిల్లీ: రాజ్యాంగాన్ని, న్యాయాన్ని సవాల్‌ చేస్తూ మితిమీరిన అధికారాన్ని చలాయిస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో మరోసారి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. న్యూస్‌ క్లిక్‌ వ్యవస్థాపకుడు ప్రబీర్‌ పుర్కాయస్థ అరెస్టు చెల్లదని సుప్రీం కోర్టు నిర్ద్వంద్వంగా తీర్పు ఇవ్వడంతో ఎన్నికల వేళ ప్రజాస్వామ్యాన్ని చెరచేందుకు కేంద్రం చేస్తున్న యత్నాలపై న్యాయ వ్యవస్థ నిరంతరం జోక్యం చేసుకోవాల్సి వస్తున్నది.
శ్రీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిలు మంజూరు చేయడంతో ఆయనను, ఆయన పార్టీని ఎన్నికల్లో దెబ్బతీయాలని చూసిన బిజెపికి దిమ్మతిరిగే షాక్‌ తగిలింది.
–  బీమా కొరెగావ్‌ కేసులో సామాజిక కార్యకర్త గౌతమ్‌ నవ్‌లఖాకు రెండు రోజుల క్రితం సుప్రీం బెయిలు మంజూరు చేసింది. ఈ కేసులో విచారణ పూర్తి కావడానికి చాలా రోజులు పట్టే అవకాశముందని దర్యాప్తు సంస్థ పేర్కొనడంతో కోర్టు ఆయనకు బెయిలు ఇచ్చింది.
– ఉపా కింద నమోదయిన ఈ కేసులో జైలుకెళ్లిన ఏడుగురికి బెయిలు లభించింది. దీనిని బట్టి బిజెపి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు కోర్టు గట్టి హెచ్చరించింది.
– బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టొరల్‌ బాండ్ల స్కీము పెద్ద స్కాముగా మారింది. పెలక్టొరల్‌ బాండ్లు రాజ్యంగ విరుద్ధమని సుప్రీం కోర్టు తీర్పు చెప్పడంతో బడా కార్పొరేట్లకు, బిజెపికి మధ్య వున్న అపవిత్ర బంధం బట్టబయలైంది. ఎన్నికలయ్యేదాకా ఈ బాండ్ల వివరాలు బయటకు రాకుండా తొక్కిపట్టాలని మోడీ ప్రభుత్వం శత విధాలా ప్రయత్నించింది.
– ఎప్‌బిఐ చేత జాప్యం చేయించాలని చూసింది. కానీ సుప్రీం కోర్టు కొరడా ఝుళిపించడంతో స్టేట్‌ బ్యాంక్‌ పూర్తి సమాచారాన్ని బయటపెట్టక తప్పలేదు.
– రాష్ట్రాలకు రుణాలు పొందే రాజ్యాంగబద్ధమైన హక్కును కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ వివక్షాపూరిత చర్యను కేరళ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్‌ చేయడంతో అక్కడ కూడా కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలింది.

➡️