బంగ్లాదేశ్‌ ఎంపి హత్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు

Jun 10,2024 00:30 #Bangladesh, #mp death

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో హత్యకు గురైన బంగ్లాదేశ్‌ ఎంపి అన్వరుల్‌ అజీమ్‌ అనర్‌ కేసులో కీలక నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. నేపాల్‌లో అక్కడి పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేయగా, భారత్‌కు తీసుకువచ్చారు.
నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు గాలింపు చేపట్టిగా.. దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఒక కాలువలో ఎంపికి చెందిన కొన్ని శరీర భాగాలను గుర్తించారు. ఈ వివరాలను పశ్చిమ బెంగాల్‌ పోలీసులు ఆదివారం వెల్లడించారు. ”వైద్యులు, ఫోరెన్సిక్‌ నిపుణుల సమక్షంలో గాలింపు జరపగా.. ఒక కాలువలో మనిషి శరీర భాగాలు, ఎముకలు లభ్యమయ్యాయి. వీటిని ఎంపికి చెందినిగానే అనుమానిస్తున్నాం. వాటిని ఫోరెన్సిక్‌ పరీక్ష కోసం పంపిస్తాం. ఇతర శరీర భాగాల కోసం గాలింపు కొనసాగుతుంది” అని పోలీసులు వెల్లడించారు. అంతకుముందు ఎంపి శరీరానికి సంబంధించినగా భావిస్తోన్న దాదాపు మూడున్నర కిలోల మాంసపు ముద్దను హత్య జరిగిన అపార్టుమెంటు సెప్టిక్‌ ట్యాంకులోనే గుర్తించిన సంగతి తెలిసిందే. అయితే ఈ శరీర భాగాల నిర్ధిష్టత గుర్తింపు కోసం డిఎన్‌ఎ పరీక్ష నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇందుకోసం డిఎన్‌ఎ నమూనాలు సేకరించేందుకు ఆయన కుమార్తెను కొల్‌కతాకు రప్పించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

➡️