కేజ్రీవాల్‌కు మరోసారి ఇడి సమన్లు

న్యూఢిల్లీ :    ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) గురువారం ఏడోసారి సమన్లు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం ఫిబ్రవరి 26న కేజ్రీవాల్‌ ఇడి ఎదుట హాజరుకావాలని సమన్లలో కోరింది. ఇడి సమన్లు చట్టవిరుద్ధమని ఆప్‌ గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం ఇప్పుడు కోర్టులో ఉండగా .. సమన్లు ఎలా జారి చేస్తారని ప్రశ్నించింది. తాను దర్యాప్తు సంస్థకు సహకరిస్తానని, అయితే సమన్లు రాజకీయ ప్రేరేపితమని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.

➡️