జార్కండ్‌లో దారుణం.. స్పెయిన్‌ యువతిపై గ్యాంగ్‌రేప్‌..!

Mar 2,2024 12:49 #Gang Rape, #Jharkhand, #police

రాంచీ: జార్కండ్‌లో దారుణం చోటు చేసుకుంద. భర్తతో కలిసి జార్కండ్‌ పర్యటనకు వచ్చిన స్పెయిన్‌ దేశానికి చెందిన యువతిపై 10 మంది దుండగులు గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డారు. ఈ ఘటనపై దుమ్కా ఎస్‌పి మాట్లాడుతూ.. టూరిస్టు వీసా మీద భారత్‌కు స్పానిష్‌ జంట వచ్చింది. వీరు జార్కండ్‌లోని దుమ్కాలో మోటార్‌ బైక్‌పై పర్యటిస్తూ పలు ప్రదేశాలు సందర్శిస్తున్నారు. ఇక్కడి కుంజి గ్రామంలో టెంట్లు వేసుకుని విశ్రాంతి తీసుకుంటున్నపుడు దుండగులు బాధితురాలిపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. రేప్‌కు గురైన తర్వాత యువతిని ఆస్పత్రిలో చేర్చించగా ప్రస్తుతం చికిత్స పొందుతోంది. మొత్తం ఆసియా ఖండంలో టూర్‌కు ప్లాన్‌ చేసిన స్పానిష్‌ జంట తొలుత పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లలో టూర్‌ పూర్తిచేసుకున్నారు. తర్వాత జార్కండ్‌ వచ్చారు. ఇక్కడి నుంచి నేపాల్‌ వెళ్లాలనేది వారి టూర్‌ ప్లాన్‌. ఇంతలోనే ఈ దారుణం జరిగింది. ఈ ఘటనలో ఇప్పటికే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)ను ఏర్పాటు చేశామన్నారు.

➡️