ఆర్మీవాహనంపై దాడి.. ఐదుకు చేరిన మృతుల సంఖ్య

Dec 23,2023 11:15 #Indian Army

శ్రీనగర్‌ : జమ్ముకాశ్మీర్‌లో పూంచ్‌ జిల్లాలో గురువారం జరిగిన ఉగ్రవాదుల దాడిలో మృతుల సంఖ్య ఐదుగురికి చేరింది. గురువారం నలుగురు మరణించగా, చికిత్స పొందుతూ శుక్రవారం ఒకరు మృతి చెందినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. సందీప్‌ కుమార్‌, శ్యామ్‌ సుందర్‌ దాస్‌, తోడ్మల్‌ జ్ఞానేశ్వర్‌ భాస్కరరావులు గాయపడ్డారని, వారిలో ఒకరు చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మరణించినట్లు అధికారులు తెలిపారు. బుధవారం నుంచి పూంచ్‌ జిల్లాలో ఉగ్రవాదుల కోసం కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతానికి వెళుతున్న రెండు ఆర్మీ వాహనాలపై రాజౌరీ జిల్లాలోని పిర్‌ పంజల్‌ వ్యాలీ వద్ద ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు.

➡️