రాజస్థాన్‌లో బిజెపి ముందంజ .. 75 సీట్లతో కాంగ్రెస్‌

Dec 3,2023 12:42 #BJP, #Crosses, #Rajasthan

న్యూఢిల్లీ :   రాజస్థాన్‌లో బిజెపి 108 సీట్లతో సగం మార్కును దాటగా, కాంగ్రెస్‌ 75 సీట్లతో వెనుకబడి ఉంది. రాజస్థాన్‌లో 199 అసెంబ్లీ స్థానాలు కాగా, అధికారంలోకి రావాలంటే మేజిక్‌ పవర్‌ 100. గతంలో రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. బిజెపి , కాంగ్రెస్‌లు విజయం సాధించిన స్వతంత్ర అభ్యర్థులతో మంతానాలు జరుపుతున్నట్లు సమాచారం. రాజస్థాన్‌ ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్‌లు టికెకట్‌ నిరాకరించడంతో 40 మంది రెబల్స్‌ పోటీ చేశారు. 2018 ఎన్నికల్లో బిజెపికి 38.77 శాతం, కాంగ్రెస్‌కు 39.30 శాతం ఓట్లు వచ్చాయి. చాలా ఎగ్జిట్‌ పోల్స్‌ బిజెకి ఎడ్జ్‌ అని అంచనా వేయగా, మూడు ఎగ్జిట్‌ పోల్స్‌ రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని అంచనావేశాయి.

➡️