ప్రకటనలకు రూ. 967 కోట్లు

Dec 20,2023 10:49 #Advertisement, #BJP Govt, #Expenditure
bjp govt Advertisement Expenditure

న్యూఢిల్లీ : 2019-20 నుండి 2023-24 వరకూ ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించేందుకు సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ (సీబీసీ) ద్వారా పత్రికలలో ప్రకటనల నిమిత్తం రూ.967.46 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్రం మంగళవారం లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలియజేసింది. 2020వ సంవత్సరపు పత్రికా ప్రకటనల విధానం ప్రకారం ప్రింట్‌ మీడియా ద్వారా సీబీసీ ప్రచార కార్యక్రమాలు చేపడుతోందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ చెప్పారు. సీబీసీ ద్వారా ఈ నెల 12వ తేదీ వరకూ ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం రూ.967.46 కోట్లు ఖర్చు చేశామని ఆయన వివరించారు. 2019 మార్చి 31 వరకూ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ న్యూస్‌పేపర్స్‌ ఫర్‌ ఇండియా (ఆర్‌ఎన్‌ఐ) వద్ద వార్తా పత్రికలు సహా 1,19,995 పత్రికలు నమోదయ్యాయని తెలిపారు. ఈ సంఖ్య 2020లో 1,43,423గా, 2021లో 1,44,520గా, 2022లో 1,46,045గా, 2023లో 1,48,363గా ఉన్నదని అన్నారు.

➡️