సుప్రీం ఆగ్రహించినా ఆగని బిజెపి కుట్రలు

  • చండీగఢ్‌ సీనియర్‌ డిప్యూటీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ స్థానాలు కైవసం

చండీగఢ్‌ : సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికల్లో బిజెపి తీరు మారలేదు. ఆప్‌ కౌన్సిలర్లను ప్రలోభాలకు, భయబ్రాంతులకు గురిచేయడం ద్వారా సోమవారం జరిగిన ఎన్నికల్లో సీనియర్‌ డిప్యూటీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ స్థానాలను బిజెపి గెలుచుకుంది. సోమవారం ఎన్నికలయ్యే వరకూ ముగ్గురు ఆప్‌ కౌన్సిలర్లను బిజెపి అజ్ఞాతంలోనే ఉంచింది. జనవరి 30న చండీగఢ్‌ మేయర్‌ ఎనిుకల్లో బిజెపి నియమించిన ప్రిసైడింగ్‌ అధికారి అనిల్‌ మసీహ్ ఆప్‌ కౌన్సిలర్ల ఓట్లను చెల్లనవిగా చేసి, బిజెపి అభ్యర్థిని మేయర్‌గా ఎనిుకైనట్లు ప్రకటించడం దేశవ్యాప్తంగా విస్మయం కలిగించింది. ఆప్‌-కాంగ్రెస్‌ ఫిర్యాదుతో దీనిపై విచారణ చేసిన సుప్రీంకోర్టు బిజెపిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫలితాలను రద్దు చేసి, ఆప్‌-కాంగ్రెస్‌ ఉమ్మడి అభ్యర్థి కులదీప్‌ కుమార్‌ను మేయర్‌గా ప్రకటించింది. ఈ నేపథ్యంలో చంఢగీఢ్‌ మేయర్‌ ఎనిుకల్లో సీనియర్‌ డిప్యూటీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ స్థానాలకు సోమవారం ఎన్నికలు నిర్వహించారు. పటిష్టమైన భద్రత మధ్య ఈ ఎనిుకలు జరిగాయి. తుది ఫలితాల్లో సీనియర్‌ డిప్యూటీ మేయర్‌గా బిజెపి అభ్యర్థి కుల్దీప్‌ సింగ్‌ సంధు మూడు ఓట్ల తేడాతోనూ, డిప్యూటీ మేయర్‌గా బిజెపి అభ్యర్థి రాజిందర్‌ శర్మ రెండు ఓట్ల తేడాతోనూ గెలుపొందారు. చండీగఢ్‌లో మొత్తం 35 మంది కౌన్సిలర్లల్లో ఆప్‌-కాంగ్రెస్‌కు 20 మంది, బిజెపికి 14 మంది, శిరోమణి అకాలీదళ్‌కు ఒక కౌన్సిలర్‌ ఉన్నారు.

➡️