అతిషికి బృందాకరత్‌ పరామర్శ

Jun 27,2024 23:50 #Atishi, #Brindakarat, #Paramarsha

న్యూఢిల్లీ : ఢిల్లీ మంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకురాలు అతిషిని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌ గురువారం పరామర్శించారు. ఢిల్లీ రాష్ట్రానికి తగినంత నీటిని సరఫరా చేయకుండా హర్యానా ప్రభుత్వం నిలిపివేయడాన్ని నిరసిస్తూ ఐదు రోజులపాటు నిరాహార దీక్ష చేసిన అతిషి అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆమెకు బృందాకరత్‌ సంఘీభావం తెలిపారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరిని ఖండించారు.

➡️